కేరళలో 'నిఫా' కలకలం

0చూసినవారు
కేరళలో 'నిఫా' కలకలం
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. పాలక్కాడ్ జిల్లాలోని 38 ఏళ్ల మహిళకు శుక్రవారం నిఫా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాధారణ వైద్య పరీక్షల సమయంలో ఆమెలో నిఫా వైరస్ లక్షణాలు కనిపించడంతో, సంబంధిత నమూనాలను పుణె ప్రయోగశాలకు పంపించారు. అక్కడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వీటిని పరీక్షించి నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్