భారతీయ బ్యాంకులను రూ.వేల కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని పోలీసులు అమెరికాలో అరెస్టు చేశారు. అతడిని అప్పగించాలన్న సీబీఐ, ఈడీల అభ్యర్థన మేరకు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని అతిపెద్ద డైమండ్ సంస్థ ఎల్ఎల్డీ డైమండ్స్‌ను మోసం చేసినట్లు నేహాల్ మోదీపై కేసు నమోదైంది. మల్టీ లేయర్ స్కీం రూపంలో సుమారు రూ.19కోట్లు మోసం చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి.