నీరవ్‌ మోదీకి యూకే కోర్టులో ఎదురు దెబ్బ

59చూసినవారు
నీరవ్‌ మోదీకి యూకే కోర్టులో ఎదురు దెబ్బ
భారతీయ బ్యాంకులను రూ.వేల కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి యూకే కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను లండన్‌ హైకోర్టు తాజాగా తిరస్కరించింది. ఆయన బెయిల్‌ విషయంపై కోర్టులో తీవ్ర వాదనలు జరిగాయి. ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్‌ బలంగా వాదించింది. నీరవ్‌ మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రుణాలు తీసుకొని రూ.13,500 కోట్ల మేర ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

సంబంధిత పోస్ట్