జైనూర్ లో 1.400 కేజీల గంజాయి పట్టివేత

70చూసినవారు
జైనూర్ లో 1.400 కేజీల గంజాయి పట్టివేత
జైనూర్ మండలంలో పోలీసులు గంజాయి పట్టుకున్నారు. ఎస్ఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం. పోచంలోద్ది గ్రామానికి చెందిన షేక్ ఖయ్యుమ్ ఇంట్లో గంజాయి నిల్వ ఉందన్న పక్కా సమాచారం మేరకు గురువారం దాడి చేశామన్నారు. ఈ దాడిలో ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1. 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేశారు. గంజాయి అమ్మినా, సాగు చేసినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్