మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే వారసులైన మాలికుల విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. శనివారం ఆసిఫాబాద్లో ఏర్పాటు చేసిన టెన్త్, ఇంటర్, విద్యార్థుల ప్రతిభా పురస్కారం అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలంటే చదువొక్కటే ఆయుధమని అన్నారు.