

లైవ్ స్ట్రీమ్ పెట్టి.. సెక్రటేరియట్ ముందున్న ఇజ్రాయిల్ జెండా తొలగింపు
మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వివిధ దేశాల జెండాల్లో ఇజ్రాయెల్ జెండాను ఒక యువకుడు తొలగించిన ఘటన కలకలం రేపింది. జకీర్ అనే యువకుడు ఈ చర్యను సామాజిక మాధ్యమాల్లో లైవ్స్ట్రీమ్ చేసి జెండా తొలగించాడు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి అతని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, ఘటన జరిగిన తరువాత అధికారులు వెంటనే ఇజ్రాయెల్ జెండాను తిరిగి స్థాపించారు.