ప్రధాన రహదారిపై పడిపోయిన చెట్టు

82చూసినవారు
ప్రధాన రహదారిపై పడిపోయిన చెట్టు
కడెం మండలంలోని ధర్మాజీపేట గ్రామ శివారులో ఉన్న ప్రధాన రహదారిపై భారీ వర్షానికి చెట్టు పడిపోయింది. దీంతో ఆ మార్గంలో కొద్దిసేపు రాకపోకలు ఆగిపోయాయి. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కడెం మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ధర్మాజీపేట శివారులో ఉన్న ప్రధాన రహదారిపై భారీ చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. స్థానికులు చెట్టును పక్కకు జరిపి రాకపోకలను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్