చిన్నారులకు తల్లిపాలను తల్లులు తప్పకుండా తాగించాలని లక్షిట్టిపేట ఐసిడిఎస్ సిడిపిఓ రేష్మ సూచించారు. గురువారం జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామంలో ఉన్న అంగన్వాడి-1 కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుడే పుట్టిన చిన్నారులకు తల్లులు తప్పనిసరిగా ముర్రుపాలను తాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.