రమేష్ రాథోడ్ కు బండి సంజయ్ నివాళి

75చూసినవారు
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పార్థివ దేహాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ సందర్శించారు. తీవ్ర అనారోగ్యంతో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ఉట్నూరులోని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ నివాసానికి వచ్చారు. అనంతరం రమేష్ రాథోడ్ పార్దివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట ఎమ్మెల్యే పాయల శంకర్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :