ఖానాపూర్ పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో మంగళవారం భూభారతి సదస్సును నిర్వహించనున్నామని స్థానిక తహశీల్దార్ సుజాత తెలిపారు. తహశీల్దార్ సోమవారం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రెవెన్యూ సదస్సు జరుగుతుందన్నారు. ఇందులో భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందని ఈ విషయాన్ని అందరూ గమనించి సహకరించాలని ఆమె కోరారు.