అనాధ వ్యక్తి మృత దేహం ఖననం

52చూసినవారు
అనాధ వ్యక్తి మృత దేహం ఖననం
జన్నారం పట్టణంలోని శ్రీలంక కాలనీలో ఒక అనాధ వ్యక్తి మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని ఖననం చేయడం జరిగిందని జన్నారం మండల పోలీసులు తెలిపారు. శ్రీలంక కాలనీలోని చర్చి వెనకాల జగ్గు అనే వ్యక్తి మృతి చెందినట్లు పంచాయతీ కార్యదర్శి రాహుల్ ఫిర్యాదు చేశారన్నారు. దీంతో వైద్యులు, పోలీసుల సమక్షంలో పంచనామా చేసి పంచాయతీ కార్మికులు అనాధ వ్యక్తి జగ్గు మృతదేహాన్ని ఖననం చేయడం జరిగిందని స్థానిక పోలీసులు వివరించారు.

ట్యాగ్స్ :