ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో ఉన్న కులవృత్తిదారులకు ప్రభుత్వం ఆధునిక యంత్రాలపై శిక్షణ ఇవ్వాలని బిసి కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కవ్వాల్ అభయారణ్యాన్ని నమ్ముకుని నియోజకవర్గంలోని పలు మండలాల్లో వేలాది మంది కులవృత్తిదారులు జీవనోపాధిని పొందుతున్నారన్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా వారికి శిక్షణ ఇవ్వాలని కోరారు.