పార్కు స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

83చూసినవారు
పార్కు స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
ఇంద్రవెల్లి మండలంలోని
గౌరపూర్ గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. బుధవారం సాయంత్రం ఆయన గౌరపూర్ గ్రామ శివారులో ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ స్థలంలో నాలుగు ఎకరాలలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి ఎన్ఆర్ఈజీఎస్ కింద నాలుగు వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్