నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, విద్యాధికారి శ్రీ రామారావులు మస్కాపూర్ ఉన్నత పాఠశాల కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫలితాల్లో ఫస్ట్ నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేసి ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్ రావు గారు, కుర్ర శేఖర్, వెన్నం అంజయ్య, షేక్ ఇమ్రాన్, రాపర్తి కిషన్ ప్రసాద్, బాదోల్ల రవి కుమార్ లు పాల్గొన్నారు.