రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది

77చూసినవారు
రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. గురువారం కడెం మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సదర్ మాట్, కడెం ఆయకట్టులకు సాగునీటిని విడుదల చేయడానికి ఉన్నతాధికారులతో మాట్లాడామని తెలిపారు. నీటి విడుదలకు సంబంధించి ఆదేశాలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. విపక్ష నాయకుల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దన్నారు. కార్యక్రమంలో యూత్ జిల్లా నాయకులు నాయకులు సతీష్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్