సోషల్ మీడియాలో ఒకరిని రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టొద్దని దండేపల్లి మండల ఎస్సై తహసినోద్దిన్ సూచించారు. మంగళవారం దండేపల్లిలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.