దండేపల్లి: ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన ఎంపీడీఓ

0చూసినవారు
దండేపల్లి: ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన ఎంపీడీఓ
దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళను త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు. శనివారం ఆ మండలంలోని పాత, కొత్త మామిడిపల్లి గ్రామాలలో ఆయన పర్యటించారు. బేస్మెంట్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ళను ఆయన పరిశీలించారు. బేస్మెంట్ వరకు పూర్తి చేసిన లబ్ధిదారుల బ్యాంకుకు ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్