దండేపల్లి మండలంలోని గుడిరేవు గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ఆ మండల ఎంఈఓ దుర్గం చిన్నయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక పాఠశాలలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ లాంటి ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడం జరిగిందన్నారు. కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధిస్తున్నామని ఎంఈఓ వివరించారు.