దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో జేష్ట మాస పూజలు ఘనంగా జరిగాయి. జేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం వివిధ ప్రాంతాల నుండి భక్తులు, ప్రజలు ఆ దేవాలయానికి భారీగా తరలివచ్చారు. అనంతరం దేవాలయంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు దేవాలయంలోని స్వామి వారిని వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.