ఆయకట్టు అభివృద్ధి కమిటీ ఎన్నిక

83చూసినవారు
ఆయకట్టు అభివృద్ధి కమిటీ ఎన్నిక
కడెం మండలంలోని ధర్మాజీపేట్ గ్రామ ఆయకట్టు అభివృద్ధి కమిటీని రైతులు, గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం వారు గ్రామంలో సమావేశం నిర్వహించి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గురిజల రాజన్న, ఉపాధ్యక్షులుగా కడ కొమురయ్య, కోశాధికారిగా గార్గుల లక్ష్మయ్య, సలహాదారులుగా దండుగుల రవి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమపై నమ్మకంతో ఎన్నుకున్న గ్రామస్తులకు నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :