గ్రీవెన్స్ రిజిస్టర్ లో వివరాలు నమోదు

66చూసినవారు
గ్రీవెన్స్ రిజిస్టర్ లో వివరాలు నమోదు
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు గ్రీవెన్స్ రిజిస్టర్ లో రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి మొదటి, రెండు దశలలో రుణమాఫీ రాని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ రైతుల వివరాలను క్లస్టర్ ఏఈవోలు గ్రీవెన్స్ రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారు. ఆ వివరాల అప్లోడ్ కు ఇంకా ఆప్షన్ రాలేదు. ఆప్షన్ వచ్చిన వెంటనే ప్రభుత్వానికి వివరాలను పంపుతామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్