కడెం: పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్

64చూసినవారు
కడెం: పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్
కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ ఓం ప్రకాష్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. అనంతరం పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ల్యాబ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ సరిత, ఆధ్యాపకులు స్వామి ఉన్నారు.

సంబంధిత పోస్ట్