దండేపల్లి మండలంలోని తాళ్లపేట రేంజ్ ఊట్ల గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్నామని ఎఫ్ఆర్వో సుష్మారావు తెలిపారు. బుధవారం రాత్రి కలపను అక్రమంగా రవాణా చేస్తుండగా ఎఫ్బిఓ సాయి గుర్తించి పట్టుకున్నారని, దీని విలువ రూ. 33, 844 వరకు ఉంటుందన్నారు. డిప్యూటీ రేంజ్ అధికారి పోచమల్లు దీనిపై విచారించి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. కలపను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె తెలిపారు.