ప్రభుత్వ పాఠశాలలతో మంచి భవిష్యత్తు: జన్నారం ఎంఈఓ

66చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలతో మంచి భవిష్యత్తు: జన్నారం ఎంఈఓ
ప్రభుత్వ పాఠశాలలతో మంచి భవిష్యత్తు ఉంటుందని జన్నారం ఎంఈఓ విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జన్నారం మండలంలోని రేండ్లగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో అక్షరాభ్యాసం నిర్వహించారు. అనంతరం ఆ పాఠశాల హెచ్ఎం కిషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చిన్నారుల కోసం 30 ప్లాస్టిక్ కుర్చీలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కిషన్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.