మంచి ఆదరణ పొందడం అభినందనీయం

75చూసినవారు
మంచి ఆదరణ పొందడం అభినందనీయం
జన్నారం మండలంలోని అక్కపల్లిగూడ పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్ విద్యార్థుల ఆదరణ పొందడం అభినందనీయమని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు అన్నారు. బుధవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని అక్కపల్లిగూడా పాఠశాలను జిల్లా అధ్యక్షుడు సందర్శించారు. అనంతరం ఆ పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్ ను ఆయన శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మధుసూదన్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్