జన్నారం పట్టణంలో బంజరు దొడ్డికి తరలించిన పశువులను వాటి యజమానులు జరిమానా చెల్లించి రెండు రోజుల్లో తీసుకువెళ్లకపోతే వాటిని గోశాలకు తరలిస్తామని పోన్కల్ గ్రామ ఈవో రాహుల్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ప్రధాన రహదారిపై పశువుల సంచారంతో ప్రజలు ఇబ్బంది పడటంతో వాటిని గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న బంజర దొడ్డికి తరలించామన్నారు. యజమానులు ఒక్కో పశువుకు రూ. 1000 చెల్లించి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.