జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ పరిధిలో ఉన్న వివిధ గ్రామాలలో సుమారు 1500 మంది రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేశామని ఏఈఓ అక్రమ్ తెలిపారు. శనివారం దేవునిగూడా రైతు వేదికలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 40 మంది రైతులు వారి పేర్లను నమోదు చేయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు పథకాలు అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు.