జన్నారం మండలంలోని అర్హులైన దివ్యాంగులు సహాయ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని స్థానిక ఎంఈఓ విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రకటన వీడియోలు చేసిందన్నారు. ఆసక్తి గల దివ్యాంగులు ఈ నెల 18 లోపు ఆన్లైన్లో https//tgobmms. cgg. gov. in లో అన్ని ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం రిసోర్స్ పర్సన్ ను సంప్రదించాలని ఆయన సూచించారు.