జన్నారం: ఆలయ పరిసరాలను శుభ్రం చేయించిన ఈవో

2చూసినవారు
జన్నారం: ఆలయ పరిసరాలను శుభ్రం చేయించిన ఈవో
తొలి ఏకాదశి సందర్భంగా జన్నారంలోని వివిధ దేవాలయ పరిసరాలను ఈవో రాహుల్ శుభ్రం చేయించారు. శనివారం ఉదయం జన్నారంలోని రామాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, తదితర ముఖ్య ఆలయాల ప్రాంగణాలను ఆయన పంచాయతీ కార్మికులతో శుభ్రం చేయించారు. తొలి ఏకాదశి రోజు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో వారికి ఇబ్బంది కలగకుండా దేవాలయ పరిసరాలను శుభ్రం చేయించామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్