జన్నారం: సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన

57చూసినవారు
జన్నారం: సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన
భూసారాన్ని పెంచే సేంద్రియ ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగించాలని జన్నారం క్లస్టర్ ఏఈఓ సంధ్య సూచించారు. శుక్రవారం జన్నారం మండలంలోని ధర్మారం గ్రామ రైతులకు ప్రకృతి వ్యవసాయం పథకంపై అవగాహన కల్పించారు. భూసారం పెంచే సేంద్రియ ఎరువులు వాడాలని, పశుసంపద కలిగిన పచ్చిరొట్టెలు వేసే రైతులతో పాటు ఇతర రైతులు ఈ పథకానికి అర్హులవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్