జన్నారం: అందుబాటులో పచ్చిరొట్టె ఎరువులు

62చూసినవారు
జన్నారం: అందుబాటులో పచ్చిరొట్టె ఎరువులు
జీలుగ విత్తనాల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని జన్నారం క్లస్టర్ ఏఈఓ త్రిసంధ్య తెలిపారు. సోమవారం జన్నారంలో ఆమె మాట్లాడుతూ పిఎసిఎస్ పోన్కల్ లో 917 ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, జన్నారంలో 300 బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. బాదంపల్లి, రేండ్లగూడ, పోన్కల్, జన్నారం, ధర్మారం గ్రామాల రైతులు పోనకల్ రైతు వేదిక వద్దకు వచ్చి పర్మిట్ తీసుకొని, ఒక బస్తాకు రూ. 2137 చెల్లించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్