జన్నారం: అరుదైన మొక్కలను కాపాడుదాం

64చూసినవారు
జన్నారం మండలంలోని ఇందన్పల్లి అటవీ రేంజ్ లో ఉన్న బర్తన్ పేట్ సెక్షన్ పరిధిలో అరుదైన ఔషధ మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని స్థానిక ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. మంచిర్యాల డిఎఫ్ఓ ఆదేశాల మేరకు బుధవారం అటవీ సిబ్బందితో కలిసి ఆయన అడవిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఔషధ మొక్కలను గుర్తించే పద్ధతిని వారికి తెలిపారు. అడవిలో అరుదైన, ఔషధ గుణాలున్న మొక్కలు చాలా ఉన్నాయని, వాటిని పరిరక్షించుకుందామన్నారు.

సంబంధిత పోస్ట్