జన్నారంలోని ఎస్బిఐ బ్యాంకులో పనిచేస్తూ బదిలీపై వెళ్తున్న మేనేజర్ మహేష్ ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమని ఆ బ్యాంకు ఖాతాదారులు అన్నారు. జన్నారం ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ మహేష్ బెల్లంపల్లి శాఖకు బదిలీ అయ్యారు. దీంతో శనివారం బ్యాంకులో మేనేజర్ ను ఖాతాదారులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మేనేజర్ మహేష్ గ్రామాలలో ఎక్కువగా పర్యటించి ఆన్లైన్ మోసాలు, బ్యాంకు రుణాలు, డిజిటల్ పేమెంట్లపై ప్రజలకు అవగాహన కల్పించారని తెలిపారు.