జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జన్నారం మండల తాహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మొర్రిగూడ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, రైతుల నుండి భూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అన్ని భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి. అనూష, ఆర్ఐ భానుచందర్, అధికారులు పాల్గొన్నారు.