జన్నారం మండల కేంద్రంలోని వ్యాపారులు దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మంచిర్యాల డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మారాణి సూచించారు. శుక్రవారం జన్నారంలోని అంగడి బజార్ ప్రాంతంలో ఆమె పర్యటించి వ్యాపారులతో మాట్లాడారు. చెత్తను బయట పడవేయవద్దని, పంచాయతీ కార్మికులకు ఇవ్వాలని ఆమె సూచించారు. పంచాయతీకి అన్ని పన్నులు కూడా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ జలంధర్, ఈవో రాహుల్, సిబ్బంది పాల్గొన్నారు.