జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యాన్ని ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందర్శించారు. 2024 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ట్రైనీ అధికారులు తెలంగాణ దర్శన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జన్నారంలోని గొండుగూడ, బైసన్ కుంట, తదితర ప్రాంతాలను సందర్శించారు. రెండు రోజుల పాటు అభయారణ్యంలోని వివిధ ప్రాంతాలను వారు సందర్శించనున్నారని జిల్లా అధికారులు తెలిపారు. శిక్షణ, క్షేత్ర పరిశీలనలో భాగంగా వారు అభయారణ్యంలో పర్యటిస్తున్నారు.