జన్నారం మండలంలోని కలమడుగు, రేండ్లగూడ గ్రామాల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం సీజ్ చేసినట్లు ఎస్సై అనూష తెలిపారు. మహేష్, లావుడ్యా భధ్రు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. మహేష్ భధ్రు తో పాటు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వెల్లడించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.