జన్నారం మండలంలో అఖిలపక్ష నాయకులు, ప్రజలు బుధవారం నిర్వహిస్తున్న స్వచ్ఛంద బంద్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అభయారణ్యంలో అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని, వాహనాలను నిలిపివేయవద్దని కోరుతూ పట్టణంలో బంద్ చేపట్టారు. ఇందులో వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొని దుకాణాలను మూసివేశారు. ప్రభుత్వం స్పందించి అటవీ ఆంక్షలను తొలగించాలని మండల ప్రజలు డిమాండ్ చేశారు.