పేదలకు వచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఆదేశాల మేరకు మంగళవారం జన్నారం మండలంలోని ధర్మారం గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జలంధర్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కే రమేష్, మాజీ సర్పంచ్ దుర్గం గంగాధర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.