అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించడం ద్వారా చిన్నారుల భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని జన్నారం మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జన్నారం మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులతో కలిసి అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులలో వారు ఊరేగింపు నిర్వహించారు.