మహిళలు అభివృద్ధి పథంలో పయనించాలని జన్నారం మండల నూతన ఎస్సై గొల్లపల్లి అనూష అన్నారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు నూతన ఎస్ఐను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కాలనీలో సమస్యలు ఏర్పడితే తనకు తెలపాలని, వాటిని పరిష్కరిస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పోతు విజయశంకర్, తదితరులు పాల్గొన్నారు.