బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దుర్గాభవాని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కడెంలో వారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటాన్ని గుర్తించి ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.