కడెం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

66చూసినవారు
కడెం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వ్యక్తి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కడెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన కొత్తూరు శంకర్(43) భూముల పంపకాల విషయంలో గొడవ జరుగగా మనస్థాపం చెంది ఈనెల 7న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్