కడెం మండలంలోని లింగాపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధి, ఖానాపూర్ మండలం బీర్నంది సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు శుక్రవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏఈఈ రాంసింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. కావున వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.