కడెం ప్రాజెక్టులో ఉన్న తాజా నీటి వివరాలను ఆ ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టులో 696 క్యూసెక్కుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి 7656 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. అయితే కుడి, ఎడమ కాలువలు, దిగువ గోదావరిలోకి కలిపి 3297 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని వారు తెలిపారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.