పాఠశాలల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కడెం మండల ఎంఈఓ షేక్ హుస్సేన్ అన్నారు. బుధవారం కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలల స్కావెంజర్లకు పారిశుద్ధ్యంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించి డిజిటల్ పద్ధతిలో అవగాహన కల్పించారు. మండలంలోని ఆయా పాఠశాలల్లో పారిశుధ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, పాఠశాలల తరగతి గదులు, తదితర అంశాలపై వివరించి అవగాహన కల్పించారు.