అంగన్వాడి టీచర్ల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బుధవారం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రమేష్ డిమాండ్ చేశారు. కడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లను రెగ్యులర్ చేసి, పే స్కేల్ వర్తింపజేయాలని అదేవిధంగా వేసవిలో అంగన్వాడి టీచర్లకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, లక్ష్మి, గంగామణి, జ్యోతి, నిర్మల, మంగ తదితరులున్నారు.