నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం తెల్లవారుజామునే మండల కేంద్రంలోని రామాలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి, ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆలయంలో భజనలు, కీర్తనలు నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లను చేశారు.