ఖానాపూర్: సమస్యలు ఏమైనా నేరుగా తనకే చెప్పాలి: ఎమ్మెల్యే

1చూసినవారు
ఖానాపూర్: సమస్యలు ఏమైనా నేరుగా తనకే చెప్పాలి: ఎమ్మెల్యే
సమస్యలు ఏమైనా ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం ఖానాపూర్ మండలం బాదన కుర్తిలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం మొత్తం సంచరిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేపడుతున్నదన్నారు.

సంబంధిత పోస్ట్