ఖానాపూర్: కళాశాల అభివృద్ధికి అందరూ సహకరించాలి

5చూసినవారు
ఖానాపూర్: కళాశాల అభివృద్ధికి అందరూ సహకరించాలి
ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆ కళాశాల నూతన ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. శనివారం ఆ కళాశాలలో ఆమె నూతన ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు సిబ్బంది, ఆమెను శాలువా కప్పి సన్మానించారు. కళాశాలలో విద్యార్థులకు ఉత్తమ విద్యను బోధిస్తూ మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేస్తానని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్